పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు ముచికుందునకు వరము ప్రసాదించుట

“రాజువై యుండియు రాజధర్మములు
యోజఁదప్పక యుండియును మృగహింస
మాని చిత్తమునఁ జిన్మయుడఁగు నన్నుఁ
బూని నిల్పితిగానఁ బొలిసెఁ బాపములు
భావిజన్మమున విప్రత్వంబుఁ దాల్చి
సేకోత్తమ నన్నుఁ జెందెద” వనుచు
ముచికుందు బోధింప మొగి నమ్మహీశుఁ 
లితంబగుభక్తి నందంద మ్రొక్కి
రికిఁ బ్రదక్షిణమై వచ్చి నృపతి
గురుతరంబగు శైలకుహరంబు వెడలి
తిసూక్ష్మతరదేహుగు మనుష్యులను
తిసూక్ష్మతరువుల నందంద చూచి
లియుగంబున వెళ్ళగా నోప ననుచుఁ 
లఁచుచు గంధమానముల కరిగె
రికావనభూమిఁ ద్మాక్షునాత్మ
లక ఘనతపోరనిష్ఠనుండె. 
రి కాలయవనుని డఁచి యమ్మధుర
రిగి తత్సేనల వనిపైఁ గూల్చి
వాని ఘోటకమణి వారణావళుల
మానైన హాటకణి కదంబముల 
ద్వారావతికిఁ బుచ్చి తాను సీరియును
నారూఢజయకాములై యుండిరంత.